May 9, 2011

HOW TO SELECT A BEST SCHOOL FOR YOUR CHILDREN

మంచి స్కూలు ఎంచుకో!

-Dr.కేశిరాజు రాంప్రసాద్‌, ఎడ్యుకేషనల్‌ సైకాలజిస్టు - Sun, 23 May 2010




మంచి స్నేహితుడిని, మంచి పుస్తకాన్ని ఎన్నుకోవటం ఎంత ముఖ్యమో మంచి విద్యాలయాన్ని ఎన్నుకోవడం అంతే ముఖ్యం. పిల్లలలో సహజాతంగా కొన్ని శక్తులు వుంటాయి. వారు పరిశీలిస్తారు, ప్రశ్నిస్తారు, ప్రయత్నాలు చేస్తారు, ప్రయోగాలు చేస్తారు, వర్గీకరిస్తారు, జతపరుస్తారు, జ్ఞాపకం ఉంచుకుంటారు, అంచనావేస్తారు, నిర్ణయాలు తీసుకొంటారు, తప్పులను తెలుసుకొంటారు, జ్ఞానాన్ని వినియోగించుకొంటారు, బేధాలనుగుర్తిస్తారు, పోలుస్తారు, బొమ్మగీసి చూపుతారు. ఈ పనులన్నీ పాఠశాలలో చేరకముందే చేయగలుగుతారు. కనుక పాఠశాలలో చేరిన తరువాత వారి శక్తులకు మెరుగులుదిద్ది వారిలోని భావాలు, సామర్థ్యాలు, అభిరుచులు, వైఖ రులను మరింతగా అభివృద్ధి చేయాలి. ఒక జాతి మేధస్సు పాఠశాల గదులలో నిర్మించబడుతుంది. విద్య వ్యక్తిత్వంలో పెనుమార్పులు తీసుకు వస్తుంది. ఏ స్కూలు విద్యార్థులకు పోరాటపటిమని, విజయకాంక్షని, సృజనాత్మకతని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుందో అదే మంచి స్కూలు.

పిిల్లల లక్షణం : పిల్లల వ్యక్తిత్వాన్ని బట్టి, చదువు నేర్చుకొనే విధానం బట్టి పాఠశాలని నిర్ణయించు కోవాలి. మీ పిల్లల మీద ఎక్కువ శ్రద్ద కావాలనుకుంటే తక్కువ మంది పిల్లలుగల సెక్షన్‌ వున్న పాఠశాలని ఎంచుకోండి. మీ పిల్లలు, డ్రాయింగ్‌, మ్యూజిక్‌, డాన్స్‌, లేక ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఏదైనా గేమ్‌ లాంటివి నర్చుకోవాలనుకుంటే అందుకు అవకాశాలున్న పాఠశాలని ఎంచుకోండి.


తల్లిదండ్రుల పరిస్థితులు : కొంతమంది తల్లిదండ్రులు పాఠశాల నిర్వహణ విలువలు, సంస్కృతీ, సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకుంటారు. అవి తమ కుటుంబ విలువలకి అనుగుణంగా వున్నాయో లేదో చూసుకుంటారు. మరికొందరు పాఠశాలలో విద్యార్థిఫీజు, డొనేషన్‌ లాంటి అంశాలని పరిగణన లోకితీసుకొంటారు. ఆర్థిక భారాన్ని అంచనావేసుకొంటారు. పాఠశాల దూరం, బస్‌ సౌకర్యం, బస్సులో వెళ్తే పట్టే సమయం, ఇతర పాఠశాలలో దొరికే సౌకర్యాలను బట్టి నిర్ణయాలకొస్తుంటారు. కొంతమంది మత ప్రాధాన్యత ఇచ్చే పాఠశాలల్ని ఎంచుకుంటారు.


స్కూలు సౌకర్యాలు : స్కూలు సౌకర్యాలని పాఠశాలలు ఇచ్చే ప్రకటనలని బట్టి, వారు వేసే మల్టికలర్‌ బ్రోచర్స్‌ని బట్టి నిర్ణయం తీసుకోకూడదు. పాఠశాలలకు వెళ్ళి చూడాలి.తరగతి గదులు, వెంటిలేషన్‌, ఫర్నిచర్‌, ఫాన్సు, యూరినల్స్‌, బాత్‌ రూమ్స్‌, సైకిల్‌ షెడ్స్‌, ఫిల్టర్‌ వాటర్‌ సౌకర్యాలు, ఆటస్థలం వగైరాలు ఉన్నాయో లేవో ప్రత్యక్షంగా పరిశీలించుకోవాలి. వాటి పరిస్థితిని గమనించుకోవాలి.

పాఠశాలకి రికగ్నేషన్‌ ఉన్నదో లేదో చూసుకోవాలి : అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది. ఈ రోజులలో రికగ్నేషన్‌ వున్న పాఠశాలలోనే చదివించాలి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు.

ఉపాధ్యాయుల అర్హతలు, అనుభవం బట్టి ఒక పాఠశాల స్థాయి తెలుస్తుంది. మీరు ఎంచుకొన్న ఉన్నత పాఠశాల, కాలేజి, ఇంజనీ రింగ్‌ కళాశాల అయితే అక్కడ మీకు ఉపయోగపడే ఐఐటి కోచింగ్‌, టోఫెల్‌, గేట్‌, లాంటి కోచింగ్‌, క్యాంపస్‌ ఇంటర్వ్యూలకి అవకాశం ఉందో లేదో చూసుకోండి. తరుచూ అధ్యాపకులు ఉపాధ్యాయులు మారని సంస్థలను చూసి ఎంచుకోండి. తరచూ ఉపాధ్యాయులు మారుతున్నా రంటే సంస్థలో లోపం వుందని అర్థం.చదువులో వెనకబడిన విద్యార్థుల పట్ల శ్రద్ధతీసుకొంటున్నదో లేదో, వారి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారో లేదో వ్యక్తిగత బలాలు, బలహీనతలు దృష్టిలో పెట్టుకొని బోధిస్తున్నారో లేదో పరిశీలించండి.

లిబ్‌, లాబ్‌ సదుపాయాలుః
విద్యార్థులకు ఉపయోగపడే అత్యాధు నిక లైబ్రరరీ, ఇంటర్‌నెట్‌ సౌకర్యం వున్న కంప్యూటర్‌లు, స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌, ఐఐటి స్టడీమెటీరి యల్‌, టోఫిల్‌, గేట్‌కి సంబంధించిన స్టడీ మెటీరియల్స్‌, జనరల్‌ నాలెడ్జికి చెందిన పుస్తకాలు, ఆడిటొరియం, సైన్స్‌ ల్యాబ్‌, ఇంగ్లీషు ల్యాబ్‌, స్పోర్ట్స్‌కి సంబంధించిన సౌకర్యాలు కన్‌సెల్టెంట్‌ డాక్టర్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఆర్ట్‌, క్రాప్ట్‌, మ్యూజిక్‌, డాన్స్‌కి సంబంధించిన టీచర్స్‌ వున్నారో లేదో ప్రత్యక్షంగా పరిశీలించుకోవాలి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి తగిన వ్యక్తులు, కౌన్సిలర్‌ వున్నాడో లేదో చూసుకోండి. హాస్టల్‌ వుంటే మంచి కిచెన్‌, నీరు, రూమ్స్‌, టాయిలెట్స్‌, ఫాన్‌ వగైరాలు, వార్డెన్‌ సామర్థ్యాన్ని పరిశీ లించాకే ఎంచుకోండి. పిల్లల్ని హాస్టల్‌ వుంచేట్టయితే వారు వుండటానికి మానసికంగా సిద్ధంగా వున్నారోలేదో తెలుసుకున్న తరువాతే నిర్ణయంతీసుకోండి.
స్కూలు రిపోర్టు కార్డ్సు : పిల్లల ప్రోగ్రస్‌ రిపోర్టు కార్డు ఎప్పటికప్పుడు ఇస్తున్నారో లేదో తెలుసుకోండి. పిల్లల అటిండెన్స్‌కి సంబంధించిన సమాచారం ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ ద్వారా తెలుపుతున్నారో పరిశీ లించండి. ఉపాధ్యాయుల పిల్లల నిష్పత్తి, ఉపాధ్యాయులకి ఇన్‌ సర్వీస్‌ టీచింగ్‌ శిక్షణ ఇస్తున్నారో లేదో, శిక్షణ ఇస్తున్నారో లేదో పరిశీలించండి. గత 5 సం||లో విద్యార్థుల ఫలితాలు ఎలా వున్నాయో తెలుసుకోండి. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారేమో తెలుసుకోండి. వాటి వివరాలు పాఠశాలలో వున్నాయో లేదో ఫలితాలని ప్రకటిస్తున్నారో లేదో తెలుసుకోవాలి.. ఒలింపి యాడ్‌ లాంటి జాతీయ రాష్ట్ర స్థాయి పోటీపరీక్షలకు, ఐఐటి లాంటి ప్రవేశపరీక్షలకు క్యాపస్‌ ఇంటర్‌వ్యూలకి తగిన శిక్షణ ఇస్తున్నారో లేదో పరిశీలించుకోండి.


తల్లిదండ్రుల సందర్శన : తల్లిదండ్రులను అనుమతించిన సమయాలలో కలుసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారో లేదో, వారి నుంచి స్కూలుకు సంబంధించిన ఫీడ్‌ బ్యాక్‌ని తీసు కోవటానికి యాజ మాన్యం ప్రయత్నిస్తోందో లేదో తెలుసుకోవాలి. పాఠశాల వాతావరణం విద్యార్థులకి స్నేహ పూర్వకంగా వుందో లేదో, విద్యార్థులలోని సృజనత్మకతని అభివృద్ధి చేసుకోటానికి అవకాశం ఉందో లేదో చూసుకోవాలి. తల్లిదండ్రులు-సంస్థకి, సందర్శకులు స్కూలుకి సంబంధిం చిన రేటింగ్‌ ఇవ్వడానికి అవకాశాలున్నాయో లేవో తెలుసుకోండి. ఈ సంస్థలో చదువుకున్న పాతవిద్యార్థులు సాధించిన విజయాలని తెలుసుకోండి.

- విద్యార్థుల గ్రేడింగ్‌, హోమ్‌వర్క్‌ బరువు గురించి తెలుసుకోండి. పాఠశాలకి సంబంధించిన పాఠ్యేతర అంశాలకి సంబంధించిన విధానం
- పేరెంట్‌ టీచర్స్‌ సమావేశాలు నిర్వహణ
- తల్లిదండ్రులని ఆహ్వానించే విధానం, పాఠశాలలో పరిశుభ్రత, పాఠశాలలో మెడిటేషన్‌, యోగా కార్యక్రమాల నిర్వహణ స్విమ్మింగ్‌, హార్స్‌ రైడింగ్‌ లాంటివి పరిశీలించండి.
- తల్లిదండ్రులు విద్యార్థుల ప్రగతికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి, సందేహాలని నివృత్తి చేసుకోడానికి గల అవకాశాలని ముందే తెలుసుకోవాలి. లిటరేచర్‌ క్లబ్‌, స్కూల్స్‌, మ్యాగజైన్స్‌, ఎగ్జిబిషన్స్‌, ఎన్‌.సి.సి స్కాట్స్‌ అండ్‌ గైడ్స్‌ అవకాశాలు, ఎక్స్‌ కర్షన్స్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో లేదో తెలుసుకోండి.
- మీ ఇంటికి బాగా దగ్గర వున్న స్కూల్లో కూడా మీ అవసరాలకి తగిన విధంగా ఉండవచ్చు చూడండి. దూరపు కొండలు చూసి భ్రమలపాలు కాకండి. మీ పిల్లలు నర్సరీ స్కూలు అయితే అది మీ ఇంటికి దగ్గరగా వుండేటట్టు చూసుకోండి.మీ పిల్లలలో కమ్యూని కషన్‌ సిల్క్స్‌, వ్రాతపూర్వక నైపుణ్యాలని
పెంచటానికి తగిన సౌకర్యాలు వున్నాయో లేదో పరిశీలించండి.

- మరో ముఖ్య విషయంలో ఇంటర్‌నల్‌ కాంపిటీషన్స్‌, స్టేట్‌ లెవల్‌, నేషనల్‌ లెవల్‌ వరకు పిల్లలు క్రీడలలో పాల్గొనే అవకాశం గురించి తెలుసుకోండి. స్కూలు వదిలిన తరువాత ఇంటి దగ్గర చదివించుకొనే సమయంలో హోం వర్క్సు పూర్తి చేసుకొనే విధానం సాయంత్రపు ఆటలు, కుదరకపోతే వేరే గేమ్స్‌, డిక్షనరీ ఆటలు, సుడోకు, ఫజిల్స్‌, ఇండోర్‌ గేమ్స్‌ తల్లిదండ్రులు ఆడించటం, మీ ఊరిలో వున్న మ్యూజియం, పరిశ్రమలకి తీసుకువెళ్లడం లాంటివి చేయండి. ఇవి మీ పిల్లలోసృజనాత్మకతను పెంచుతాయి. మీ వూరిలో జరిగే సాహిత్య కార్యక్రమాలకు తీసుకువెళ్లడం, వివిధ పోటీలకు తీసుకువెళ్లడం ద్వారా పిల్లలలో అభిరుచులు పెంచడానికి దోహద పడతాయి.
Dr.KESIRAJU RAMPRASAD
EDUCATIONAL PSYCHOLOGIST

1 comment:

Addressing gathering in Chambers college,Plalkolk in Jawahar Knowledge centre