May 9, 2011

CHILDREN-- ENJOY THE SUMMER HOLIDAYS

An Article published in Andhra Prabha daily
హాలిడే.. జాలిడే...
కేశిరాజు రాంప్రసాద్‌, పాలకొల్లు. - Sun, 2 May 2010,
Dr.KESIRAJU RAMPRASAD
EDUCATIONAL PSYCHOLOGIST


CHILDREN-- ENJOY THE SUMMER HOLIDAYS



పిల్లలకి సెలవులంటే ఎంతో ఇష్టం. చాలామంది పరీక్షలు అయిపోయిన వెంటనే తరువాత తరగతి పుస్తకాలు సంపాదించి ముందు నుంచే వాటిని నేర్పాలనే ఉద్దేశంతో సెలవులలో ప్రైవేటు క్లాసులు పెట్టిస్తూ వుంటారు. ఇది ఎంత మాత్రం మంచిదికాదు. సంవత్సరం చదువు నుంచి మెదడు విశ్రాంతి పొందటానికి అని సెలవులు ఇస్తారు. ఆరు రోజుల పని తర్వాత ఒకరోజు మెదడు విశ్రాంతి తీసుకొంటే మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని మానసిక విశ్లేషకులు తెలియ చేస్తున్నారు. ఇది తెలియక చాలామంది తల్లిదండ్రులు పిల్లలని సంవత్సరమంతా పుస్తకాల పురుగులుగా చేసి వారిని భవిష్యత్తులో అప్ర యోజకులుగా చేస్తున్నారని భావించటం లేదు ఏ పిల్లలైతే వేసవి సెలవులు ఆనందంగా గడుపుతారో వారి జీవితం
మంచి జ్ఞాప కాలతో టెన్షన్‌ లేకుండా గడపగలుగుతారు. సెలవులలో ఆనందంగా గడపటం వల్ల గుండె జబ్బులు, మానసికంగా వచ్చే సమస్యలు 32 శాతం తగ్గిపోతాయని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. సెలవులలో ప్రశాంతంగా నిద్రపోవడం ముఖ్యం. 2000 మంది పిల్లలనుసర్వే చేయగా వేసవి సెలవలని ఆనందంగా గడపకపోవటం వల్ల 32 శాతం మంది శారీరక సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. వసవి సెలవులు ఆనందంగా గడిపేవారు చాలా బాగా చదవగలుగుతారు అని ప్రముఖ సైకో థెరపిస్టు సి. వెబర్‌ అంటారు. సెలవులు అనే పదమే విద్యా ర్థులను ఉత్తేజపరు స్తుందని వారిలో మానసిక గ్లానినితగ్గిస్తుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి సెలవలనీ ఎన్నిరకాలుగా సద్వినియోగం చేసుకోవచ్చునో గమనిద్దాం.

సాధారణంగా పిల్లలకి సంగీత మంటే ఇష్టం. వారికిష్టమైన మ్యూజిక్‌ నేర్పించండి. దీనికోసం సెలవులలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. కొంతమందికి నాటికలు అంటే ఇష్టం. దానికోసమూ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. బొమ్మలుగీసే నైపుణ్యం ఉంటే సెలవులలో పదనుపెట్టండి. కుటుంబంతో సహా వీలుంటే రెండు మూడు రోజులు సముద్రం దగ్గరికి విహార యాత్రకి వెళ్లండి. అక్కడనత్త గుల్లలు, శంఖాలు, ఆలుచిప్పలు, రకరకాల రాళ్లు పోగుచేయవచ్చు, పోగుచేసిన ఆలుచిప్పలు, నత్తగుల్లలతో రకరకాల దండలు, వివిధ రకాల డిజైన్స్‌ చెెయవచ్చు. ఇంటి ముందు ఆ దండలని డెకరేటివ్‌ పీసెస్‌ చేయవచ్చు. డాల్‌ మేకింగ్‌, క్రోకరీ మేకింగ్‌ నేర్పించవచ్చు. అలాగే మ్యూజియంలు చూపించి వివిధ కాలాల ఆర్థిక సామాజిక, చారిత్రక నేపథ్యాలని తెలియజేయవచ్చు.
స్పోర్ట్స్‌ ఆడిటోరియంలలో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించి వివిధ క్రీడలకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి గలవారు దీనిలో చేరవచ్చు. స్కేటింగ్‌, రోలర్‌ స్కేటింగ్‌, గోగార్పింగ్‌ లాంటి అంశాలలో శిక్షణ ఇప్పించవచ్చు. రోప్‌స్కిప్పింగ్‌ నేర్పించవచ్చు. సెలవులలో మంచి పుస్తకాలు చదివే అలవాటు నేర్పండి. కొత్త విదేశీ భాషను, స్పోకెన్‌ ఇంగ్లీషుని నేర్పించవచ్చు.
టైము మేనేజిమెంట్‌ ఆవశ్యకతను తెలపండి. వేసవి సెలవులలో ఆలస్యంగా నిద్రలేవడానికి ఇష్ట పడతారు పిల్లలు ఇది మంచి పద్ధతికాదు. త్వరగా నిద్ర లేవడం ప్రారంభించాలి. ఫాస్టు ఫుడ్స్‌కి దూరంగా ఉంచటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడాలి.
మీ మేడపైన పూల పండ్ల తోటలు పెంచడం, కుండలలో, వివిధ పాత పాత్రలలో పాడయిపోయిన పాత బూట్లలో మట్టి వేసి పూలమొక్కలు పెంచవచ్చు. మేడపైన ద్రాక్ష తీగలను పెంచుతున్న రోజులివి. పట్టణాలలో వున్నవారు గ్రామాల్లో ఈ సెలవులు గడపాలి. గ్రామాల్లో వున్న వారు పట్టణాలకి, నగరాలకి వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలని తెలుసుకోవడం ప్రారంభించాలి.
సెలవలలో గ్రామాలకి వెళ్ళి గడపటం ఆనందంగా వుంటుంది. మంజుకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు ఉప్పుకారంతో తినటం చాలా సరదాగా వుంటుంది. తోటలలో తిరగడం చాలా సరదాగా ఉంటుంది. మీ అమ్మగారికి వంటలో ఇంటి పనిలో సహాయం చేసి వారికి ఆనందాన్ని కలిగించవచ్చు. మీ నాన్న గారికి వారుచేసే పనిలో సహాయం చేయవచ్చు.
అంతా కలసి విహార యాత్ర చేయండి. దానివల్ల కుటుంబంలో అనుబంధాలు పెరుగుతాయి. దక్షిణ భారత దేశంలో ఊటి, కొడైకెనాల్‌, యార్కడ్‌, పెరియార్‌ వైల్డ్‌ లైఫ్‌ విడిది కేంద్రం, కేరళ బీచ్‌ వాటర్స్‌, కోవలం బీచ్‌, హార్సిలీహిల్స్‌, అరకు లాంటి ప్రదేశాలు చూడతగ్గవి. విశాఖపట్టణం, భీమిలి తక్కువేం కాదు. డార్జిలింగ్‌, కులు, మనాలి, గుల్మార్గు, శ్రీనగర్‌ ఎంతో గొప్పవి.
వేసవి సెలవులలో పాత స్నేహితులను, బంధువులని కలసినట్టు వుంటుంది ఒక ట్రిప్‌ వేసి రండి. అలా వెళ్ళినప్పుడు ఆ దగ్గరిగా ఉన్న చారిత్రక ప్రాధాన్యత వున్న ప్రదేశాలను చూడటం మంచిది.
మీరు కొత్తగా పాఠశాలలు మారాలంటే ఈ వేసవి సెలవులలో కొత్త పాఠశాలలను, వాతావరణాన్ని దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించటానికి ప్రయత్నం చేయండి. పాఠశాలను సందర్శించండి. పాలిటెక్నిక్‌, ఎమ్‌సెట్‌, సి.ఎ. ఎంట్రన్స్‌, పి.జి. ఎంట్రన్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతుంటే దానిమీదే మనసు పెట్టండి. ఖాళీగా ఉండే వారు మేథమేటిక్స్‌ పజిల్స్‌ పూర్తి చేయడం మంచిహాబీ శకుంతలా దేవి పుస్తకాలలో చాలా బ్రైన్‌ టీజర్స్‌ వుంటాయి. సూడోకు కూచి పద పూరణ, గళ్ళ నుడి కట్టు పూర్తి చేయడం పిల్లలకి నేర్పాలి. కాగ్నేటివ్‌ మెమరీ, రీజనింగ్‌, సైకో మోటార్‌ డైమెన్‌లలో ప్రేరణ కలిగించేలా అవి వివిధ రకాల ఆటలు ఆడించాలి.
ఆధ్యాత్మికతను పెంచుకోవడం. చదివే చదువు టెన్షన్‌కి గురి అవుతుంటే ''యోగా'' నేర్చుకోవడం మంచిది. ఉపాసనా లేక ప్రాణాయామం, పిరమిడ్‌ స్పిరుచ్యువల్‌ సొసైటీ వారి ధ్యానపద్ధతి, రాజయోగా మెడిటేషన్‌ లాంటి ఏదో ఒక పద్ధతి నేర్చుకోవడం ఎక్కువ ఉపయోగం.
మీ పిల్లలలో సృజనాత్మకతను వెలికి తీసే ఏ కార్యక్రమం అయినా వారి భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తుంది.

No comments:

Post a Comment

Addressing gathering in Chambers college,Plalkolk in Jawahar Knowledge centre