Apr 9, 2011

We want Jan Lok Pal Bill






జన్ లోకాపాల్ కావాల్సిందే!
మా ముసాయిదాను ఆమోదించాలి..
ప్రజలు, అధికారులతో కమిటీ వేయం...డి
నిరవధిక దీక్షలో అన్నా హజారే డిమాండ్
అన్ని వర్గాల నుంచి మద్దతు
ఉద్యమించాలని ప్రజలకు కిరణ్ బేడీ పిలుపు
దీక్షపై ప్రధాని కార్యాలయం అసంతృప్తి
కోరల్లేని లోక్‌పాల్ కాదు... అవినీతిని చీల్చి చెండాడే 'జన్ లోక్‌పాల్' కావాలంటూ ప్రఖ్యాత సామాజిక సేవకుడు అన్నా హజారే (72) ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అవినీతికి కళ్లెం వేసేలా విస్తృత అధికారాలతో కూడిన అంబుడ్స్‌మెన్‌ను నియమిస్తూ జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తొలుత రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులు అర్పించారు.

ఆ తర్వాత ఓపెన్ టాప్ జీపులో త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఇండియా గేట్ వద్దకు ప్రదర్శనకు వెళ్లారు. పలువురు విద్యార్థులు, ప్రజలు, అభిమానులు హజారేకు అభివాదం చేశారు. ఆ తర్వాత ఆయన జంతర్‌మంతర్ వద్ద దీక్ష ప్రారంభించారు. "జన్ లోక్‌పాల్ ముసాయిదా తయారీకి 50% అధికారులు, 50 % పౌరులు, మేధావులతో కూడిన సంయుక్త కమిటీని నియమించాలి. ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చేదాకా నా నిరాహార దీక్ష కొనసాగుతుంది'' అని హజారే ప్రకటించారు.

ఆయనకు సంఘీభావంగా స్వామి అగ్నివేశ్, మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ, మెగసెసె అవార్డు గ్రహీత సందీప్ పాండే తదితరులు తరలి వచ్చారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లు ప్రకారం... ఈ సంస్థకు పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. ఎంపీలు అవినీతికి పాల్పడినట్లు గుర్తించినా చర్యలు తీసుకోలేదు. పైగా... తనంతట తాను దేనిపైనా విచారణ చేపట్టలేదు.

స్పీకర్ సిఫారసుల మేరకు మాత్రమే స్పందిస్తుంది. లోక్‌పాల్ సిఫారసులను తిరస్కరించినా అడిగే దిక్కులేదు. ఇందులో పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. కోరల్లేని లోక్‌పాల్‌పై ఎన్నాళ్ల నుంచో అసంతృప్తి ఉంది. దీని స్థానంలో జన్‌లోక్‌పాల్ బిల్లు తీసుకురావాలంటూ అన్నా హజారేతోపాటు అనేకమంది ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.

కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే, సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కిరణ్ బేడీ, సమాచార హక్కు కార్యకర్త అరవింద్ కేజ్రివాల్‌లు కలిసి జన్‌లోక్‌పాల్ ముసాయిదాను కూడా రూపొందించారు. 'దీనిని కేంద్రం రూపొందించిన లోక్‌పాల్ బిల్లుతో పోల్చి చూడండి. కేంద్రం చేసిన ముసాయిదాతో ఏమాత్రం ఫలితం ఉండదు. లక్ష్యం నెరవేరదు' అని హజారే పేర్కొన్నారు. "జన్‌లోక్‌పాల్‌కు మద్దతు పలకండి. మీ గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో దీనిపై ఉద్యమించండి'' అని హజారే, కిరణ్ బేడీ ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రధాని కార్యాలయం అసంతృప్తి

హజారే దీక్షను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం పలురకాలుగా ప్రయత్నించింది. రక్షణ మంత్రి ఆంటోనీతో కూడిన మంత్రివర్గ ఉప సంఘ సభ్యులు సోమవారం హజారేను కలిశారు. "తాము రూపొందించిన బిల్లును కేంద్రం యథాతథంగా ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో చర్చలు ఫలించలేదు'' అని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. తమ కార్యాలయం స్వయంగా కోరినప్పటికీ హజారే దీక్ష విరమించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

"హజారేపై పూర్తి విశ్వాసముంది. ఆయనను మేం గౌరవిస్తున్నాం'' అని పీఎంవో పేర్కొంది. ఈ ప్రకటనపైనా హజారే మండిపడ్డారు. 'మాపై గౌరవం ఉన్నప్పుడు... గత నెలరోజులుగా మాతో ఒక్కసారైనా ఎందుకు చర్చించలేదు? తూతూమంత్రపు హామీలను నమ్మేది లేదు'' అని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లు తయారు చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదని అన్నారు. జస్టిస్ సంతోష్ హెగ్డే, ప్రశాంత్ భూషణ్, స్వామీ అగ్నివేశ్ వంటి ప్రముఖుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం విచారకరమన్నారు.

కాగా, అవినీతిపై 72 ఏళ్ల వయసులో హజారే చేపట్టిన దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. 'అవినీతి వ్యతిరేక భారత్' అనే స్వచ్ఛంద సంస్థ ముంబైలో శివాజీ పార్కు నుంచి ఆజాద్ మైదాన్‌దాకా వంద కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించింది. ఢిల్లీలో హజారేకు మద్దతుగా అనేక చోట్ల బ్యానర్లు వెలిశాయి. జన్ లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టాల్సిందేనని బీహార్ డిప్యూటీ సీఎం ఎస్‌కే మోడీ (బీజేపీ) డిమాండ్ చేశారు.

హజారేకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. జనతాదళ్ (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వచ్చారు. ప్రధాని ఇప్పటికే ఒక ఉప కమిటీని నియమించిన నేపథ్యంలో హజారే దీక్షకు దిగాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ అన్నారు. హజారేకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు

No comments:

Post a Comment

Addressing gathering in Chambers college,Plalkolk in Jawahar Knowledge centre