Feb 13, 2012

ADHD

ADHD MEANS ATTENTION DEFFCIAT HYPERACTIVE DISORDER.
(నిన్నటి ఆర్టికల్ కి ఇది కొనసాగింపు. దీన్ని గ్రహించమని చదువరులకు సూచన)
ఉపాద్యాయులు,తల్లి తండ్రులు,స్కూల్ యాజామాన్యాలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ADHD అంటే ఏకాగ్రత లోపం గలిగిన విద్యార్థులు మరియు విపరీత మైన అల్లరి విద్యార్థులు. వక ఏకాగ్రత మాత్రమే లోపమైతే వీరిని ADD లోపం గలిగిన విద్యార్థులు అంటారు. ఈ లోపం గలిగిన విద్యార్థులు నరాల బలహీనత గలిగి ఉంటారు. వీరు కొంచంసేపూ వక చోట కూర్చోలేరు,ఏకాగ్రత తో చదవలేరు, వ్రాయలేరు.
ఏ పిల్లలైతే స్కూల్ లో ,ఇంటి లో తుఫాను లాంటి అల్లరి చేస్తూ, గట్టిగ అరుస్తూ, ఎడ్యుకేషన్ లో వెనకబడి ఉంటూ. ఎక్కువసేపు ఆటలాడుతూ, టీవీ చూస్తూ, ఇంటి లో వారికీ, స్కూల్ లో వారికీ మనశాంతి లేకుండా చేస్తూ వుండే పిల్లలను ADHD పిల్లలు అనవచ్చు.వీరు తరచూ ప్రమాదాలకు గురి అవుతుంటారు.వీరితో హోం వర్క్ చేయించాలంట చుక్కలు చూడాలంతే.
ఈ సమస్య తో ఇబ్బందులు పడేవారు వారికి నచ్చినది చేస్తారు తప్ప ప్లాన్ చేసినట్టు గాని, నియమాలను ఉల్ల్లంఘిమ్చాలని గాని చేయరు.వీరు 3 ప్రధాన లక్షణలు కలిగిఉంటారు. అవి ఏకాగ్రత లోపం, హైపెరాక్టివిటి, ఇమపుల్సివిటి.
ఈ సమస్యతో బాధపడేవారిలో బాలురు శాతం బాలికలకంటే 5 రెట్లు ఎక్కువ. ఈ సమస్యతో బాధపడేవారి శాతం 8 % నుంచి 10 % వుంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ సమస్యను బాల్యంలోనే అధిగమిస్తారు. కొద్దిమంది స్టూడెంట్స్ కాలేజీ లైఫులో అధిగమిస్తారు ఈ సమస్యను. పెద్దవారిలో ఈ సమస్యతో బాధపడేవారు సంఖ్య్ తక్కువ.
క్రింది అంశాలలో మీ పిల్లలుగాని, విద్యార్థులు గాని బాధపడుతుంటే, సమస్య లు ఎదుర్కుంటే వారిని ADHD విద్యార్థులు గా చెప్పవచ్చు.

ఈ పిల్లలు ఎక్కువసార్లు ఉద్రకంగా ఉంటారు. వీరిని సదా శాంత పరుస్తండలి. వీరిని పెద్దలు సదా " ఆది చెయ్యొద్దు, ఇది చెయ్యద్దు, దాన్ని క్రింద పెట్టు, అల్లరి చెయ్యద్దు, కదలకుండా కూర్చో ' అని చెబుతూ ఉండాలి. వీరు అల్లరి చేసినప్పుడల్లా పెద్దలు, మాస్టర్స్ వారిని దండిస్తంటారు ఏమిచెయ్యాలో అర్థంకాక. ఇలా తరుచుగా దెబ్బలు, తిట్లు తింటూ ఉండటంవల్ల వీరిలో ఉద్రేకం పెరిగిపోతుఉంటుంది.ఇది చాలా ప్రమాదంలోకి భవిషత్తు లో మారవచ్చు.
వీళ్లు తప్పులు చేయలని చేయరు. వీరు పనులను సరిగా చేయలేకపోవటంవల్ల అవి తప్పులుగా మారుతుంటాయి. ఈ చేయలేని అసక్తత, నిస్సహాయత వీరిని వ్యతిరేకులుగా మారుస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు సరిగా చదువు నేర్చుకోలేరు. ఇంకా ఆందోళన మరియు డిప్రెషన్ లాంటి సమస్యలతో సతమతమవుతారు. అత్మనున్యతాభావంతో ఉంటారు.
ADHD కొంచం కటినమయిన సమస్య.కాని తల్లితండ్రులు, మంచి మిత్రులు, సహకరించే టీచర్స్ ఉంటే ఈ సమస్య పరిష్కారం చాలా సులభం.
ADHD లో ప్రథానంగా అవధానం ప్రధాన సమస్య. అవధానం రెండు రకాలు. 1 . వ్యామోహం (fasination ) 2 . నిర్ద్యేసిత అవధానం. వ్యామోహం నచ్చిన అంశం మీద ఉంటుంది కాబట్టి అది అందరికి ఇష్టం. ఆ పనిని ఎంతసేపు అయిన చేస్తారు దానిలో వారికీ బోర్ కొట్టదు. ఎంతసేపు అయిన అవధానం ఉంటుంది. కానీ నిర్దేశ అవధానంలో ఇష్టం లేకపోయినా అవధానం చేయాలి. చదవాలని ఉండదు కానీ చదవాలి. చదవకపోతే మార్కులు రావు. ADHD లో సవాలుతోకూడిన సమస్య నిర్దేశిత అవధానం. ఈ పిల్లలు చదవాలని ప్రయత్నం చేస్తారు కానీ విసుగు, చికాకు వచ్చి మరొక అంశం మీద గాని వారికీ నచ్చిన అంశం మీద గాని మాత్రమే వారు అవధానం చేస్తారు.
ADHD కారణాలు
ఈ సమస్య ఎందుకు వస్తుందో స్పష్టంగా తెలియలేదు. కానీ క్రింది కారణాల వల్ల రావొచ్చని పరిశోధనలు తెలియచేస్తునాయి.
1 . పుట్టినపుడు తక్కువ బరువు ఉండడం.
2 . కాలుష్యకరమయిన LEAD ఎక్కువవున్న వాతావరణంలో ఉండడంవల్ల.
3 . నెలలు నిండకుండా పిల్లలను కనడం.
4 . గర్భధారణ సమయంలో మద్యం, సిగరెట్టూ లాంటివి త్రాగడం.
5 . తలమీద బలంగా దెబ్బ తగలడం.
6 . గర్భధారణ సమయంలో తల్లి ఎక్కువ ఆందోళన చెందడం.
7 . మెదడులో కెమికల్ మార్పులవల్ల.
8 . ADHD సమస్య పిల్లల మెదడు బరువు ఇతర సాధారణ పిల్లల మెదడు బరువుకన్నా 5 % నుండి 10 % బరువు తక్కువ ఉంటుంది.
9 . మేనరికం లేక దగ్గిర సంబంధాలవల్ల.
10 . ఈ సమస్య అప్పుడప్పుడు స్కూలు, ఇల్లు, వూరు మారినప్పుడు లేక తల్లితండ్రుల విడాకులు, హటాత్తుగా వంటరితనం, అనారోగ్యం లాంటి సమస్యల వల్ల బయటపడవచ్చు.
11 . రెండు వసంతాల వయస్సులో వారికి ఎక్కువసేపు టీవీ చూపించడం, వీడియో గేమ్స్ ఆడించడం వల్ల ఈ సమస్య రావచ్చని నూతన పరిశోధనలు తెలియచేస్తునాయి.

ఈ రోజులలో ఈ సమస్యను అధిగమించడానికి చాలా పరిష్కారాలు ఉన్నాయి.

పరిష్కారాలు

cognative behaviour థెరపి ద్వారా వ్యతిరేకభావాలు తగ్గించవచ్చు. కోపింగ్ స్కిల్స్ ( సర్థుబాటు నయిపుణ్యాలు ) చెప్పడం ద్వారా సమర్థవంతంగా పనులు చేయడం, చదువుమీద, పనిమీద శ్రద్ద పెట్టటం నేర్చుకుంటారు.
Behaviour థెరపి ద్వార సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, పనుల విషయంలో ప్రయారిటీలు ఎలా చేసుకోవాలో, లక్ష్యం మీద పనిచేయడం నేర్చుకుంటారు. సాంఘిక నయిపుణ్యాలు పెంచుకోవడం ద్వార ఈతరులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకొంటారు.
సోషల్ స్కిల్స్ థెరపి ద్వారా సామాజిక ప్రవర్తనలు, బాడీ లాంగ్వేజ్ నియమాలు తెలుసుకోవడంవల్ల ఈతరులతో ఎలా ఉండాలో తెలుస్తుంది.
టాక్ థెరపి ద్వారా ఈ సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. వీరు అత్మనున్యతాభావంతో ఉంటారు. వీరికి పరిక్షలలో తక్కువ మార్కులు, అన్నతమ్ములు, అక్కచెల్లలుతో పోల్చడం వల్ల, పనులు సరిగా చేయకపోవడం వల్ల ఈ సమస్య ఉంటుంది. వీరికి ఈ టాక్ థెరపి బాగా ఉపయోగముంటుంది.
ట్రైనింగ్ ఫర్ పేరెంట్స్ ద్వారా పిల్లలను ఏవిధంగా అభినందించాలి, ఆలంబన ఇవ్వాలి, వారిని ఏవిధంగా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి.
ఈ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్స్ ద్వారా మందులు వాడాలి.
సూచనలు
    వీరికి అవధానం ట్రైనింగ్ ఇవ్వాలి.
    కాగ్నటివ్ ట్రైనింగ్ లో శిక్షణ ఇవ్వాలి.
    ఎవరో ఒకరు వారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి.
    తరగతి గదిలో కిటికీ పక్కన కుర్చోనివ్వకూడదు. అలాఉంటే వారు ఎక్కువ డిస్తుర్బ్ అవుతారు.
    ముందు వరసలో కుర్చోనివ్వాలి.
    ఈ విద్యార్థుల తల్లితండ్రులకు హోం వర్క్ ప్లాన్ రొజూ పంపించాలి.
    పాజిటివ్ రెయిన్ఫోర్సుమెంట్ ఇస్తూవున్దాలి. ఈ ప్రత్యక బహుమతులు ద్వార వారి సెల్ఫ్ ఎస్టీం పెరుగుతుంది.
    తక్కువ హోం వర్క్ ఇవ్వాలి.
    ప్రత్యక సూపర్ విజన్ వీరి మీద ఉండాలి.
    వీరని ప్రత్యక దృష్టిలో చూడాలి.
    వీరిని అందరిలో తిట్టకూడదు.
    వీరిని విజయలపట్ల ప్రొస్థహిస్తూన్దాలి.
    వీరికి ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి శిక్షణ ఇప్పించాలి.
    వీరి లో ఉన్న టేలంట్ ని గుర్తుంచి దానిలో ప్రత్యక శిక్షణ ఇప్పించాలి. టీచర్స్, తల్లితండ్రులు వీరి సాధించిన చిన్న విజయాలను సెలెబ్రేట్ చెయ్యాలి.తద్వారా వీరి సెల్ఫ్ ఎస్టీం పెరుగుతుంది.
    సరియిన క్రమశిక్షణ విధానాన్ని పాటించాలి. వారు సరిగా ఉండకపోతే కొన్ని సౌకర్యాలను విత్ డ్రా చేయాలి.
    తరచూ సుధీర్గ ఉపన్యాసాలు ఇవ్వకూడదు. చిన్న చిన్న సూచనల ద్వార భాద్యతలను అప్పగించాలి.
    వీరు చదువుతున్నపుడు ఇంట్లో టీవీ ని ఆపివేయాలి.
    వీరి పనులను వారే స్వయంగా చేసుకొనేలా చేయాలి. భాద్యత లను స్వీకరించేలా చేయాలి. వారి బట్టలు, పుస్తకాలూ , టిఫిన్ బాక్స్, బొమ్మలు వారినే సర్దుకోనేలా చేయాలి.
    వారంతట వారు స్వయంగా నిద్రనుంచి లేచేలా చేయాలి.
    వారు రోజూ వారు చేయాల్సిన పనులను వొకే విధంగా చేసుకొనేలా చేయాలి.ఈ రొటీన్ వల్ల వారి కార్యక్రమాలలో నిర్దిష్హ్త వస్తుంది.
    ఎక్కువ ఛాయస్లు ఇవ్వకూడదు. వీరికి ఇలా ఇవ్వడంవల్ల వీరికి స్పష్తత వస్తుంది.
    స్టెప్ బై స్టెప్ ఇమప్రోవమేంట్ కోసం ప్రయత్నం చేయాలి.వొకేసారి వీరిని మార్చాలని ప్రయత్నం చేయకూడదు.
    బలవంతంగా చదివించకూడదు.హోం వర్క్ మధ్యలో విరామం ఇస్తూ చదివించాలి.

Dr. KESIRAJU RAMPRASAD
EDUCATIONAL PSYCHOLOGIST AND COUNSELOR
kesirajuramprasad@gmail.కం


ADDRESSING THE STUDENTS AT DEEPTHI SILVER JUBLEE CELEBRATION.sHARING THE STAGE WITH M.L.C SRI K. NAGESWAR AND Dr.CH. SATYANARAYANA MURTHY GARU AND COORESPONDENT SRI APPARAO





ADDRESSING THE STUDENTS AT DEEPTHI SILVER JUBLEE CELEBRATION.sHARING THE STAGE WITH M.L.C SRI K. NAGESWAR AND Dr.CH. SATYANARAYANA MURTHY GARU AND COORESPONDENT SRI APPARAO



ADDRESSING THE STUDENTS AT DEEPTHI SILVER JUBLEE CELEBRATION.sHARING THE STAGE WITH M.L.C SRI K. NAGESWAR AND Dr.CH. SATYANARAYANA MURTHY GARU AND COORESPONDENT SRI APPARAO



1 comment:

Addressing gathering in Chambers college,Plalkolk in Jawahar Knowledge centre