Feb 10, 2012

ADHD-ATTENTION DEFICIT HYPERACTIVITY DISORDER- AN ARTICLE IN TELUGU


I Don't  know how to write a బ్లాగ్ ఇన్ తెలుగు.   కట్టా శ్రీనివాస్ గారు తెలుగు లో వ్రాయమంటే ఈ ప్రయత్నం చేశాను. అక్షర దోషాలు ఉంటే మన్నించండి.

ADHD MEANS ATTENTION DEFICIT HYPERACTIVITY DISORDER.
ఉపాద్యాయులు,తల్లి తండ్రులు,స్కూల్ యాజామాన్యాలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ADHD అంటే ఏకాగ్రత లోపం గలిగిన విద్యార్థులు మరియు విపరీత మైన అల్లరి విద్యార్థులు. వక ఏకాగ్రత మాత్రమే లోపమైతే వీరిని ADD లోపం గలిగిన విద్యార్థులు అంటారు. ఈ లోపం గలిగిన విద్యార్థులు నరాల బలహీనత గలిగి ఉంటారు. వీరు కొంచంసేపూ వక చోట కూర్చోలేరు,ఏకాగ్రత తో చదవలేరు, వ్రాయలేరు.
సమస్య తో ఇబ్బందులు పడేవారు వారికి నచ్చినది చేస్తారు తప్ప ప్లాన్ చేసినట్టు గాని, నియమాలను ఉల్ల్లంఘిమ్చాలని గాని చేయరు.వీరు 3 ప్రధాన లక్షణలు కలిగిఉంటారు. అవి ఏకాగ్రత లోపం, హైపెరాక్టివిటి, ఇమపుల్సివిటి.
పిల్లలైతే స్కూల్ లో ,ఇంటి లో తుఫాను లాంటి అల్లరి చేస్తూ, గట్టిగ అరుస్తూ, ఎడ్యుకేషన్ లో వెనకబడి ఉంటూ. ఎక్కువసేపు ఆటలాడుతూ, టీవీ చూస్తూ, ఇంటి లో వారికీ, స్కూల్ లో వారికీ మనశాంతి లేకుండా చేస్తూ వుండే పిల్లలను ADHD పిల్లలు అనవచ్చు.వీరు తరచూ ప్రమాదాలకు గురి అవుతుంటారు.వీరితో హోం వర్క్ చేయించాలంట చుక్కలు చూడాలంతే.
సమస్యతో బాధపడేవారిలో బాలురు శాతం బాలికలకంటే 5 రెట్లు ఎక్కువ. సమస్యతో బాధపడేవారి శాతం 8 % నుంచి 10 % వుంటుంది. చాలామంది స్టూడెంట్స్ సమస్యను బాల్యంలోనే అధిగమిస్తారు. కొద్దిమంది స్టూడెంట్స్ కాలేజీ లైఫులో అధిగమిస్తారు సమస్యను. పెద్దవారిలో సమస్యతో బాధపడేవారు సంఖ్య్ తక్కువ.
క్రింది అంశాలలో మీ పిల్లలుగాని, విద్యార్థులు గాని బాధపడుతుంటే, సమస్య లు ఎదుర్కుంటే వారిని ADHD విద్యార్థులు గా చెప్పవచ్చు.
లక్షణాలు
1. త్వర గా అలసిపోతారు
2. కూర్చోమని గట్టిగా చెప్పినా కదలకుండా కూర్చోలే రు.
౩. సులువుగా ఏకాగ్రతను కోల్పోతారు.
4. అందరితో కలిసే ఆటలలో తమవంతు ఆట వచ్చేవరకు ఓపిక పట్టలేరు.
5. తమకు తెలిసిన జవాబులు గట్టిగా అరచి చెబుతారు
6. చెప్పిన సూచనలు విన్నా పాటించలేరు
7. ఏకాగ్రతతో చేసే పనులను సరిగా చేయలేరు.
8. చాలా ఎక్కువ సార్లు చేస్తున్న పనిని వదిలేసి మరో పని చేస్తుంటారు.
9. చాలాసార్లు ప్రశాంతంగా ఆడుకోలేరు.
10. ఎక్కువ సార్లు ఎక్కువగా మాట్లాడుతుంటారు.
11. ఎదుట వారు మాట్లాడుతుంటే మథ్య లో అడ్డు తగులుతుంటారు.
12. చెప్పింది వినటానికి ప్రయత్నం చేయరు.
13. తమ వస్తువలను ఎక్కువ సార్లు పోగొట్టుకొంటారు.
14. ప్రమాదాలు వల్ల వచ్చే ఫలితాలను ఉహించలేక రిస్క్ తీసుకుని ఎక్కువ సార్లు గాయాల పాలవుతుంటారు.
15. ప్రతీ పనిని చాలా ఆలస్యంగా చేస్తుంటారు.
16. నిర్వహణా సామర్థ్యం సరిగా ఉండదు.
17. రోజు చేసే పనులును కూడా మరచిపోతుంటారు.
18. తరచూ పరిగెడుతుంటారు,అన్ని ఎక్కుతుంటారు.
19. క్యూ లో నిలబడమంటే వీరి వల్ల కాదు.
20. మొండిగా ఉంటారు.
21. కూపంతో ఈతరుల మీద అరూస్తుంటారు.
22. తరచూ సహనాన్ని కోల్పోతుంటారు.
23. నియ్‌మాలను ఆమలుచేయరు.
24. పెద్ధల మాటలను వినరు.
25. మాస్టర్ల మాటలను వినరు.
26. వంటరిగా ఉండాలనుకుంటారు.
27. లెర్నింగ్ సమస్యలతో భాధపడుతుంటారు.
28. వీరి చేతి వ్రాత బాగా ఉండదు.
29. ఎక్కువ భయపడుతుంటారు.
30. వీరు చెడు పిల్లలు కాదు.
31. లో సెల్ఫ్ ఎస్టీమ్ తో బాధపడుతుంటారు.

రేపటి బ్లాగ్ లో పరిష్కారాలు కోసం చూడండి.

Dr. Kesiraju Ramprasad
EDUCATIONAL PSYCHOLOGIST

addressing the students at ANDHRA GEERVANA  VIDYA PITHAM KOVVUR.



addressing the students at ANDHRA GEERVANA VIDYA PITHAM KOVVUR.

HONOURED IN THE ANDHRA GEERVANA VIDYA PITHAM, KOVVUR. A MEMORABLE OCCASSION. . MY  GREAT GRAND FATHER SRI KESIRAJU NARASIMHA APPARAO GARU ASSOCIATED WITH THIS INSTITUTION

2 comments:

  1. The points covered in the blog so far are useful to the students who are suffering from the psychologicl disorder ADHD (ATTENTION DEFICIT HYPERACTIVITY DISORDER). All these disorders can be controlled by conselling them with an expert like Dr. Kesiraju Ramprasad. A very good and educative blog helpful to the parents too.

    ReplyDelete
  2. Good article for school going children.Highly Educative / Informative to parents.

    ReplyDelete

Addressing gathering in Chambers college,Plalkolk in Jawahar Knowledge centre